692kms | ఆరావళితో ఆటలా?

692kms | ఆరావళితో ఆటలా?
ఆరావళి పర్వతాలలో మైనింగ్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోంది. ఈ పర్వతాలు రాజస్థాన్ నుంచి ఢిల్లీ మీదుగా గుజరాతికి వ్యాపించి ఉన్నాయి. అయితే, ఆరావళి పర్వత ప్రాంతాల్లో గొప్ప ఖనిజాలు ఉన్నాయి. వాటి కోసం తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై వివాదాలు సుప్రీంకోర్టుకు చేరాయి. పరిమిత ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాల్లో మైనింగ్ చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు… ఆ ఎత్తును ఎక్కడి నుంచి పరిగణించాలో, అనేక నిబంధనలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే, ఆ వివారాలు వెల్లడించ కుండా తీర్పును తప్పుగా విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ నగరంలో ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీ కాలుష్యం గురించి రోజుకో కథనం వెలువడుతోంది.
692kms | మళ్ళీ ఈ అంశం సుప్రీంకోర్టుకు
ఇలాంటి పరిస్థితుల్లో ఆరావళి పర్వత శ్రేణుల్లో పరిమిత ఎత్తున్న పర్వత సానువుల్లో మైనింగ్‌కు అనుమతించడంతో వివాదం రేగింది. ఈ ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడడంతో చర్చనీయాంశం అయింది. ఆరావళి పర్వత ప్రాంతంలో జీవ వైవిధ్యం కూడా ఉంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఖనిజాల తవ్వకాన్ని అనుమ తిస్తే… జీవవైవిధ్యాన్ని చేతులారా నాశనం చేసుకోవడమే అవుతుందని పర్యావరణవేత్తలు మొరపెట్టుకుంటున్నారు. అంతేకాక, థార్ ఎడారి నుంచి, ఇంకా రాజస్థాన్‌లోని ఇతర ఎడారుల నుంచి వీచే వేడి గాలుల ప్రభావం హర్యానా మీదుగా, ఢిల్లీ, గుజరాత్‌లకు విస్తరిస్తాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

692kms | కోర్టులు చారిత్రకమైన, కీలకమైన పాత్ర
అయినా, ఆరావళి పర్వతాలను కొల్లగొట్టే కార్యక్రమం జరిగిపోతోంది. ఆరావళి పర్వత శ్రేణిలో సబర్మతి నది ఉద్భవించింది.ఈ పర్వత శ్రేణి పశ్చిమ దిశలో 692 కిలో మీటర్లు విస్తరించింది. ఆరావళి వయసు సుమారు 670 మిలియన్ సంవత్సరాలు క్రిందటి నాటిది. ఆరావళి పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటి ప్రకృతి సిద్ధమైన పర్వతాలు, భూగర్భ విశేషాలను కాపాడుకోవడం ద్వారా ఆధునిక విపత్తులను ఎదుర్కోవచ్చు. ఆరావళి పర్వతాల పరిరక్షణ కోసం గతంలో కోర్టులు చారిత్రకమైన, కీలకమైన పాత్రను పోషించాయి. మైనింగ్ కార్యకలాపాలు ప్రజా సంక్షేమానికి ఏ విధంగా హాని చేస్తున్నాయో 1990. దశకంలోనే సుప్రీంకోర్టు వివరించింది. వందలాది క్వారీలను మూసి వేయాలని ఎంసి మెహతా వర్సెస్ యూనియన్ గవర్నమెంటు కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ సమతూక స్థితిని కాపాడేందుకు, సెన్సిటివ్ జోన్ల పరిరక్షణకు తవ్వకాలపై నిషేధాలను విధించింది. ఈ పర్వతాలు తరిగి పోతుంటే ముందుగానే చలిగాలులు మన దేశంలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే.
692kms | ఖనిజాల కోసం తవ్వకాలు
వంద మీటర్ల కన్నతక్కువ ఎత్తు ఉన్న ప్రాంతంలో మైనింగ్ జరుపు కోవచ్చునని అనుమతి ఇవ్వడం వల్ల ఈ పర్వత శ్రేణులను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సమతూక స్థితి దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు. ఇతర దేశాల్లో కూడా అమూల్యమైన, అపురూపమైన ఖనిజాల కోసం తవ్వకాలు జరిపే కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అభివృద్ధి- ప్రకృతి పరిరక్షణ అనేవి ఉత్తర-దక్షిణ ధ్రువాల వంటివి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో వచ్చిన మార్పుల ప్రభావమే మన దేశంలో కూడా కని పిస్తోంది. దీంతో చారిత్రక ప్రశస్తి కలిగిన ఆరావళి వంటి సహజసంపదను కోల్పోతున్నాం.
