Palnadu | జంట హత్యల కలకలం…

Palnadu | జంట హత్యల కలకలం…

  • అన్నదమ్ముల దారుణ హత్య…
  • పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం..
  • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…
  • జంట హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది…

Palnadu దుర్గి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పుల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అన్నదమ్ముల దారుణహత్య ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అడిగొప్పల అమ్మవారి గుడి దగ్గర వాటర్ ప్లాంట్ లో కొత్త శ్రీరామ్ మూర్తి (35) గ్రామంలోని బొడ్రాయి దగ్గర కొత్త హనుమంతు (31) అనే ఇద్దరు అన్నదమ్ములను గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.

Palnadu

హనుమంతును గ్రామం మధ్యలోనే, శ్రీరామమూర్తిని అమ్మవారి గుడి సమీపంలో అత్యంత కిరాతకంగా హతమార్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ హత్యలకు కారణాలు ఏమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. పాతకక్షలు లేదా ఇతర వివాదాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Palnadu

Leave a Reply