Amma Foundation | ఆర్థిక సహాయం అందజేత..

Amma Foundation | ఆర్థిక సహాయం అందజేత..
Amma Foundation | దండేపలి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని అనాథ వృద్ధురాలు అవునూరి రాజవ్వకు ఈ రోజు అమ్మ ఫౌండేషన్(Amma Foundation) ఆధ్వర్యంలో మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అమ్మ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాజవ్వ అనే వృద్ధురాలకు ఎవరూ లేకపోవడంతో తినడానికి కూడా ఇబ్బంది ఉండడంతో విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు నిత్యవసర సరుకులను(essential commodities) మూడు నెలలకు సరిపడే విధంగా అందజేశారు. ఇంకా ఎవరైనా ఆపదలో ఉన్న ఆ ఫౌండేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు కట్ట వెంకటేష్, అధ్యక్ష కార్యదర్శులు చెన్నవేని భాను ప్రసాద్, అల్లంల కుమారస్వామి యాదవ్, సభ్యులుగాండ్ల వెంకటేష్, రజిత పాల్గొన్నారు.
