Dwakra Women’s | మహిళల ఆరోగ్యం కోసం “సఖి సురక్ష”

Dwakra Women’s | మహిళల ఆరోగ్యం కోసం “సఖి సురక్ష”

  • 22,23 తేదీల్లో.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో
  • 30 ఏళ్ల పైబడిన డ్వాక్రా మహిళలకు ఉచిత స్క్రీనింగ్, స్కానింగ్ పరీక్షలు.

Dwakra Women’s | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : డ్వాక్రా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెప్మా ఆధ్వర్యంలో “సఖి సురక్ష” ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 22 (సోమవారం) 1-20 వార్డుల పరిధిలోని వారికి, 23 (మంగళవారం) 21-50 వార్డుల పరిధిలోని వారికి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించే “సఖీ సురక్ష” కార్యక్రమంలో ద్వారా.. 30 సంవత్సరాల పైబడిన మహిళలకు 16 రకాల స్క్రీనింగ్, స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

బీపీ, థైరాయిడ్, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, మహిళలకు సంబంధించిన క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య పరీక్షల అనంతరం గుర్తించిన హైరిస్క్ మహిళలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా టెలి కాన్ఫరెన్స్ వైద్య సేవలు, రూ.5లక్షల బీమా అందించే ఆరోగ్య కార్డులను అందించడం జరుగుతుందన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య పరీక్షలకు హాజరయ్యే మహిళలు ఆధార్ కార్డు, ఆధార్ తో అనుసంధానమైన ఫోన్ నెంబరు తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని నగరపాలక సంస్థ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply