Minister | ప్రతివార్డు అభివృద్ధి చేసి చూపిద్దాం….

Minister | ప్రతివార్డు అభివృద్ధి చేసి చూపిద్దాం….

  • గెలుపొందిన ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ నాయకుల సన్మానాలు.

Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలు ప్రతి గడపకు అందజేస్తూ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సహకారంతో ప్రతి వార్డును అభివృద్ధి చేసి చూపిద్దామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో తుది విడత ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు సువర్ణ రవి, అనిల్ రెడ్డి, కొక్కు మల్లేష్, ఇస్మాయిల్, ఈనాపర్వీన్ లను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవ చేయాలన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ(problems) పరిష్కరిద్దామని అన్నారు. అధికార పార్టీ నాయకులందరూ సమిష్టి కృషితో ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన(deserving) ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

గెలుపొందిన ప్రతి వార్డు సభ్యుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు బాధ్యతాయుతంగా పనిచేస్తూ పార్టీకి కట్టుబడి ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చూపేందుకు గెలుపొందిన ప్రజా ప్రతినిధులు(representatives) నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు లింగం, మాజీ ఎంపిటిసిలు శివరామరాజు గోవిందప్ప, నాయకులు గోపాల్ రెడ్డి, కుర్వ వెంకటేష్, మక్తల్ ఇబ్రహీం, కుర్చీద్, మోహన్ రెడ్డి, శంకర్, రాఘవేందర్ గౌడ్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply