15 schools | గణిత పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపిక‌…

15 schools | గణిత పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపిక‌…

15 schools | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలం జాగిర్యాల్ జిల్లాలో పరిషత్ పాఠశాల ఇంగ్లీష్ మీడియంకు చెందిన లక్మీపతి స్టూడెంట్ జిల్లా స్థాయి గణిత పోటీలకు ఎంపికయ్యారు. జాగిర్యాల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్టూడెంట్ ఈ నెల 20న పీఎం శ్రీ భీంగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి గణిత పోటీల్లో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో మండలంలోని 15 పాఠశాలల(15 schools)కు చెందిన స్టూడెంట్స్ పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం(English medium)లో గణిత పోటీలు నిర్వహించగా ఇంగ్లీష్ మీడియం నుండి జాగిర్యాల్ పాఠశాల కు చెందిన లక్మీపతి పాల్గొని మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి డిస్ట్రిక్ట్ లెవెల్(district level) పోటీలకు ఎంపికయ్యారు.

ఎంపికైన స్టూడెంట్ ను గైడ్ టీచర్ ఎల్. వీరేష్ రెడ్డితో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ల‌క్ష్మీప‌తిని ఆదర్శంగా తీసుకొని పోటీలకు సిద్ధం కావాలని గైడ్ టీచర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సూచించారు.

Leave a Reply