Thanks | కాంగ్రెస్‌కు అద్భుత ఫలితాలు..

Thanks | కాంగ్రెస్‌కు అద్భుత ఫలితాలు..

కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన‌ సీఎం రేవంత్‌


Thanks | హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM A.Revanth Reddy) పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు ఇచ్చారన్నారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కష్టఫలితమన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు (Thanks) తెలిపారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రదర్శన (strong performance) కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం కావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో సహకరించిన అధికారులు, ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. “గాంధీ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని కేంద్ర బీజేపీ దురాలోచన చేస్తోందన్నారు. ఇది దేశ స్వాతంత్ర్య సమర ఆదర్శాలకు వ్యతిరేకమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరిన్ని వివరాలు వెల్లడించారు. ఉపాధి హామీ పథకం గాంధీజీ స్ఫూర్తితో రూపుదిద్దుకున్నదన్నారు. దీని పేరు మార్చడం ద్వారా బీజేపీ తన రాజకీయ దురుద్దేశాలను ప్రదర్శిస్తోందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఈ పథకాన్ని ప్రస్తావించారనే కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజలకు అన్యాయమని, పథకం పేరు మార్పు వల్ల దాని మూల ఆదర్శాలు మరుగున పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తుందని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply