Sarpanchs | సర్పంచులుగా బావా, బావమరిది

Sarpanchs | సర్పంచులుగా బావా, బావమరిది

Sarpanchs | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకేసారి బావ, బావమరిది ఇద్దరు సర్పంచులు (Sarpanchs) గా ఎన్నికయ్యారు. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ (లోకపల్లి) గ్రామ సర్పంచిగా చంద్రశేఖర్ గౌడ్ బీజేపీ నుండి రెండవ విడత జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందారు.

మూడవ విడత జరిగిన ఎన్నికల్లో మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచిగా ఎన్నికయ్యారు. బావ గుడిగండ్ల సర్పంచ్ గా, బావమరిది ఎక్లాస్ పూర్ సర్పంచ్ గా ఒకేసారి ఎన్నిక కావడంతో వారి బంధువర్గాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు.

అదృష్టం అంటే ఇలా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బావ, బావమరిది ఒకేసారి సర్పంచులుగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. గుడిగండ్ల సర్పంచ్ గా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ గతంలో ఎంపీటీసీగా గెలుపొంది బీజేపీ నుండి మక్తల్ వైస్ ఎంపీపీగా పనిచేశారు. చంద్రశేఖర్ గౌడ్ (Chandrasekhar Goud) మొదటి సారి ఎక్లాస్ పూర్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మొత్తం మీద బావా, బావమరిది ఇద్దరూ ఒకేసారి సర్పంచులుగా ఎన్నిక కావడం విశేషం.

Leave a Reply