Late Night | ల్యాబ్‌ల పై విజి లెన్స్

Late Night| ల్యాబ్‌ల పై విజిలెన్స్
Late Night ఆంధ్రప్రభ : కర్నూలు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న మెడికల్ డయాగ్నస్టిక్ ల్యాబ్ల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. కర్నూలు యూనిట్ అధికారులు, డీఎం & హెచ్‌ఓ కర్నూలు అధికారులతో కలిసి కర్నూలు పట్టణం, కర్నూలు మండలం, జిల్లాలోని పలు డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
Late Night |తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలు..

- ఎల్‌వీ డయాగ్నస్టిక్ ల్యాబ్, ఎన్آర్‌పేట – పరీక్షల ధరల జాబితా ప్రదర్శించలేదు. రికార్డులు సరిగా నిర్వహించలేదు..
- వెంకటేశ్వర ల్యాబ్, ఎన్ ఆర్ పేట – డీఎం & హెచ్‌ఓ అనుమతులు పొందలేదు. రికార్డులు నిర్వహించలేదు.. ధరల జాబితా ప్రదర్శనలో లేదు.
- (a) సజీవరాయ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, (b) గంగా పాలీ క్లినిక్, (c) హర్ష ఈఎన్‌టి హాస్పిటల్ – ఎన్ ఆర్ పేట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవు. బయోమెడికల్ వ్యర్థాల సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. పరీక్షల ధరల జాబితా ప్రదర్శించ లేదు.
- అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎన్ ఆర్ పేట – ఏపీ ఈ రిజిస్ట్రేషన్, ఫైర్, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ సర్టిఫికెట్లు గడువు ముగిశాయి. రికార్డులు నిర్వహించలేదు.
- అమితా హాస్పిటల్, ఎన్آర్‌పేట – డాక్టర్ల జాబితా, నర్సుల జాబితా, ధరల జాబితాలు ప్రదర్శించలేదు. రికార్డులు నిర్వహించలేదు.
- ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ క్లినిక్, ఎన్آర్‌పేట – ఏపీఎంసీఈ, పీసీ అండ్ పి ఎన్ డి టి, ఏఆర్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్రదర్శించ లేదు.
- (a) గ్రీన్ పాత్ ఎలీసా ల్యాబ్, (b) శ్రీ డయాగ్నస్టిక్స్,ఈసీజీ సెంటర్ – బుధవారం పేట ఏబీఎంసీఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదు. ధరల జాబితా ప్రదర్శించలేదు. పాథాలజిస్ట్ నియామకం లేదు.
- (a) శివాని డయాగ్నస్టిక్స్ & ల్యాబ్, (b) శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ – బుధవారం పేట ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు.
- బయో ల్యాబ్ డయాగ్నస్టిక్స్ సెంటర్, బుధవారం పేట – ఏపీఎంసీ రిజిస్ట్రేషన్‌లో ఉన్న చిరునామాకు భిన్నమైన ప్రాంతంలో ల్యాబ్ నడుస్తోంది. ధరల జాబితా ప్రదర్శించలేదు.
- శ్రీ వెంకటేశ్వర ల్యాబ్, బుధవారం పేట – ఏపీఎంసీఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదు. ధరల జాబితా ప్రదర్శించలేదు.
- శ్రీ రిద్ధి హాస్పిటల్ & ల్యాబ్, బుధవారం పేట – ల్యాబ్‌కు ఏపి ఎన్ సీఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదు.
- రాము హార్ట్ కేర్ సెంటర్, గాయత్రి ఎస్టేట్స్ – డీఎం & హెచ్‌ఓ రిజిస్ట్రేషన్ ప్రకారం 2డీ ఎకో యంత్రం మేక్ ఎస్ వర్డ్ మై ల్యాబ్ గామాగా ఉండాలి. కానీ తనిఖీ సమయంలో “సోనీ సైడ్ ఎంటర్బో మేక్ యంత్రం ఉంది.
- శివ సాయి పాలీ క్లినిక్, గాయత్రి ఎస్టేట్స్ – డీఎం & హెచ్‌ఓ అనుమతులు పొందలేదు. బయోమెడికల్ వ్యర్థాల సర్టిఫికెట్ లేదు.
- (a) రెమెడీ క్లినిక్, (b) శ్రీ సాయి చంద్ర పాలీ క్లినిక్ – గాయత్రి ఎస్టేట్స్ డీఎం & హెచ్‌ఓ అనుమతులు పొందలేదు.
- గురు రాఘవేంద్ర డెంటల్ క్లినిక్ – డీఎం & హెచ్‌ఓ అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఇతర కన్సల్టెంట్ డాక్టర్లతో కూడా క్లినిక్ నడుపుతున్నారు.
- (a) విజయ డయాగ్నస్టిక్ సెంటర్, (b) భారతి డయాగ్నస్టిక్ సెంటర్ – గాయత్రి ఎస్టేట్స్ ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు. ఈ ఉల్లంఘనల పై సంబంధిత ల్యాబ్‌లు, ఆసుపత్రులపై డీఎం & హెచ్‌ఓ అధికారులు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. దీని పై సమగ్ర నివేదికను త్వరలో సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
click here to read | Venigandla Ramu | గుడివాడ అభివృద్ధికి కృషి
