Elections | ప్రశాంతంగా 92.8 శాతం పోలింగ్

Elections | ప్రశాంతంగా 92.8 శాతం పోలింగ్

Elections | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలో 26 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 236 వార్డు మెంబర్స్ స్థానాలకు 21 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడత బుధవారం 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు(Elections) జరిగాయి. 23 గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు 59 మంది పోటీ చేయగా 215 వార్డు మెంబర్స్ స్థానాలకు 517 మంది పోటీ చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలలో మండల వ్యాప్తంగా మొత్తం 38,501 ఓట్లు(total 38,501 votes) ఉండగా 35,717 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 92.8 శాతం పోలింగ్ జరిగినట్లుగా జిల్లా ఎన్నికల సహాయ అధికారి, చౌటుప్పల్ ఎంపీడీవో సందీప్ కుమార్ తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధికంగా దేవలమ్మ నాగారం గ్రామంలో 98.7శాతం పోలింగ్ జరగగా అతి తక్కువగా దామెర గ్రామంలో 56.6శాతం పోలింగ్(polling) జరిగింది. మండలములో జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి తదితర అధికారులు పరిశీలించారు.

Leave a Reply