STUDENT | లండన్ నుంచి వచ్చి..

STUDENT | లండన్ నుంచి వచ్చి..
- ఓటేసిన ఎంఎస్ విద్యార్థి
STUDENT | అబ్దుల్లాపూర్ మెట్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యతకు నిదర్శనం. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమి పట్ల తన కర్తవ్యాన్ని మరవకుండా, ప్రజాస్వామ్యానికి అంకితభావంతో ముందుకు వచ్చిన యువతకు ఇది చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. లండన్‌లో ఎంఎస్ చదువుతున్న విద్యార్థి లవణ్ కుమార్ (Student Lavan Kumar) తెలంగాణలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఆయన ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు
