Road Widening | టిడిఆర్‌ల జారీ వేగవంతం

Road Widening | టిడిఆర్‌ల జారీ వేగవంతం

  • పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలి
  • నగరపాలక కమిషనర్ పి.విశ్వనాధ్
Road Widening

Road Widening | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జి (Bridge) వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు సంబంధించి టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ‌ ఉస్మానియా కళాశాల, వడ్డేగేరి ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు సంబంధించిన కొలతలను కమిషనర్ పరిశీలించారు.

Road Widening

నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రధాన రహదారుల (Roads) విస్తరణ పనులు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని, ఇందుకు టిడిఆర్ బాండ్ల మంజూరులో పారదర్శకత, వేగం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రహదారి విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు నగరవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆస్తి యజమానులకు టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా అన్ని నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకతతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులు నగర అభివృద్ధికి కీలకమని, ఇతర శాఖలతో సమన్వయంతో పని చేసి టిడిఆర్ బాండ్ల జారీని త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, బిల్డింగ్ ఇన్‌ స్పెక్టర్లు వేమన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Road Widening

Leave a Reply