Candidate | అభివృద్దే లక్ష్యం..

Candidate | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : సాలెగూడా గ్రామపంచాయతీ అభివృద్దే తన లక్ష్యం అని సర్పంచ్ అభ్యర్థి కుర్సెంగా తిరుపతమ్మ అన్నారు. సాలెగూడా గ్రామంలో ఎన్నిల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం కొరకు కృషి చేస్తానని, మురికి నీటి కాలువలు, సీసీ రోడ్స్ నిర్మాణం, అర్హులైన వారికి పెన్షన్ మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
