back 2 us | మా పైసల్ మాకియ్యాలె

back 2 us | మా పైసల్ మాకియ్యాలె

డబ్బు తీసుకుని ఓటేయని వారికి
చుక్కలు చూపిస్తున్న పరాజితులు
ఇంటింటికీ వెళ్లి ఒత్తిళ్లు, వేడుకోళ్లు
దేవుళ్ల సెంటిమెంట్ తో ప్రమాణాలకు డిమాండ్
పల్లె పోరులో కొత్త ట్రెండ్.
రివర్స్ పంచాయితీ
అటు అభ్యర్థులకు, ఇటు ఓటర్లకు ఇదొక నీతి పాఠం కావాలి
అభ్యర్థుల చర్యలకు సర్వత్రా మద్దతు
ఇలాగైనా ప్రలోభాలకు చెక్ పడుతుందని సామాజికవేత్తల హర్షం
ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్ష

back 2 us |ఎన్నికల సందర్భంగా చిచ్చు

ఓట్ ఫర్ సేల్ ఇది తెలుగు రాష్ట్రాలను కలవరపాటుకు గురిచేస్తున్న ప్రధాన సమస్య. ఇచట ఓట్లు అమ్మబడును అనే బోర్డులు పెట్టకున్నా, ఓటర్లు అభ్యర్థులందరి నుంచి డబ్బులు దండుకుంటున్న పరిస్థితులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహాసం చేస్తున్నాయి. పడిపోతున్న ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, నైతికతతో ఓటు వేయాలని సామాజికవేత్తలు నెత్తీ నోరూ బాదుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం రావడం లేదు. పైగా ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి పచ్చని పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా
చిచ్చు రేగుతున్నట్లు కనిపిస్తోంది.

back 2 us ఆత్మీయతను పంచుకున్న పల్లె ప్రజలు

నిన్నా మొన్నటి వరకు అన్నా తమ్ముడు, బాబాయి – అబ్బాయి, మామయ్య అల్లుడు, అక్కా, చెల్లి, వదిన, పిన్ని, అత్తా అంటూ వరసలతో పలకరించుకుంటూ ఆత్మీయతను పంచుకున్న పల్లె ప్రజలు పంచాయతీ ఎన్నికల పుణ్యమాని వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. మొదటి, రెండో దశ ఎన్నికల్లో పెద్దమొత్తంలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాసుల వర్షం కురిపిస్తూ, మద్యం సీసాలు పంపిణీ చేస్తూ, అభ్యర్థులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు.

రెండు దశల ఎన్నికలు పూర్తి కాగా, గెలుపొందిన వారు ఉత్సాహంతో సంబురాల్లో మునిగి తేలుతుండగా, ఓటమి చెందిన వారు తీవ్ర మనోవేదనతో కృంగిపోతున్నారు. ఈ క్రమంలోనే తామిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో, డబ్బులు పుచ్చుకున్న వారు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సాక్షిగా ప్రారంభమైన ఈ విప్లవం నలుదిశలా పాకి, ఓటు వేసేందుకు డబ్బులడిగే పరిస్థితికి చరమగీతం పాడాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.

మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

click here to read more

Leave a Reply