Devotion | చండీ హోమం..

Devotion | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఉన్న శ్రీ జంబులమ్మ గుడి(Sri Jambulamma Temple) ఎదురుగా ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్దలతో(With devotion and care) చండీ హోమం బ్రహ్మశ్రీ నందన చక్రవర్తి, నందస్వామి పర్యవేక్షణలో జరిగినట్లు ఆలయ వ్యవస్థాపకులు వీరబోయిన యల్లాస్వామి తెలిపారు. నంద్యాలలో సాయిబాబా మందిరం(Sai Baba Temple) 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావను నామ సంవత్సర (name year) దక్షిణాయన-మార్గశిర మాన- శుక్లవక్షం ద్వాదశి అనగా నేటి నుండి గురువారం వరకు దత్త జయంతిని శ్రీ గురుదత్తుని ఆశీస్సులతో మూడు రోజులు చండీ హోమాలు(Chandi Homa) జరుగుతాయన్నారు. చండీమాత, గురుదేవుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కొరుకుంటూ, అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత వరమేశ్వర, గురు దత్తుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, పుణ్యహవచనం, మండప ఆరాధన, శ్రీచత్ర సహిత రుద్రాభిషేకం, గణపతి హోమం, లక్ష్మీగణపతి హోదం, నవగ్రహ హోమం(Navagraha Homam), రుద్రహోమం, చండీ హోమం అనంతరం మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ చేశామన్నారు.

Leave a Reply