MLC Kavitha | కాళేశ్వరం నీళ్లెక్కడ…?

MLC Kavitha | కాళేశ్వరం నీళ్లెక్కడ…?
MLC Kavitha | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డికి నీళ్లు వస్తాయని, నిజామాబాద్, దుబ్బాక, భాన్సువాడలకు నీళ్లు వస్తాయని ప్యాకేజీ 22 మొదలు పెట్టారన్నారు. ప్యాకేజీ 22కు మొత్తం రూ.1446 కోట్లు కావాలన్నారు. కానీ ఇప్పటి వరకు 450 కోట్లు ఇచ్చారని చెప్పారు. అంతే కాకుండా ప్యాకేజీ 22 కట్టాలంటే 1500 ఎకరాల భూమి కావాలన్నారు.

కానీ అందులో రెండో వంతు భూమిని కూడా సేకరించలేదని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు తనపై కంపనోరేసుకుని అరుస్తారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) తో కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఇంత వరకు నిజామాబాద్ కు కూడా రాలేదని చెప్పారు. ఒకేఒక్కసారి హల్దీవాగు నుండి నీళ్లు తీసుకువచ్చి నిజాంసాగర్ నింపారన్నారు. తరవాత నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు కురిశాయని దాని అవసరమే లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చుక్క నీరు కూడా రాలేదన్నారు. ఇదిలా ఉంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు వల్లనే కేసీఆర్కు అవినీతి మరక అంటుకుందని వ్యాఖ్యానించారు.
