Ootkur | భక్తి మార్గంలో నడవాలి..

Ootkur | భక్తి మార్గంలో నడవాలి..

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మనసులంతా భక్తి మార్గంలో నడవాలని.. అందరూ సమానమేనని చాటి చెప్పే బాధ్యత మానవాళిపై ఉందని శ్రీశ్రీశ్రీ శబరి పీఠం (Sri Sri Sri Sabari Peetham) ఊట్కూర్ సన్నిధానం గురుస్వామి మేకల భగవంతు అన్నారు. గురువారం నారాయణపేట (Narayanpet) జిల్లా ఊట్కూర్ మండల సరిహద్దు నందేపల్లి గ్రామంలో 16మందికి అయ్యప్ప మాల ధారణ చేశారు.

48దినములు ఎంతో కఠోరమైన భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షలను చేపట్టి వారి కుటుంబ సభ్యులకు, గ్రామానికి మంచి జరగాలని అయ్యప్ప మాలధారణ చేసుకుంటారన్నారు. మాలధారణ (maladharana) నియమనిష్టలతో చేపట్టాలని కన్య స్వాములు గురుస్వాముల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామిలు శంకర్ గానకోకిల రాముగౌడ్, నందేపల్లి అనిల్ గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply