President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి

President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి

President | ఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ పురోగతికి రాజ్యాంగమే అసలైన మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఆమె ప్రసంగిస్తూ… కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన వ్యవస్థలో మార్పులు ఎంత వచ్చినా, రాజ్యాంగ పరిమితులకే దేశం కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది రాజ్యాంగమని, ప్రజల హక్కులను రక్షించే శక్తి అదేనని రాష్ట్రపతి (President) అన్నారు.

రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఇది. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను కల్పించింది. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. సామాజిక న్యాయం సాధనలో భాగమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అని ద్రౌపదీ ముర్ము ((Draupadi Murmu) తెలిపారు.

Leave a Reply