Chittoor | స్పెషల్ సమ్మరీ రివిజన్..

Chittoor | స్పెషల్ సమ్మరీ రివిజన్..
Chittoor, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశాల మేరకు క్లెయిమ్ ల పరిష్కారం వేగవంతంగా చేయడం జరుగుతుందని డిఆర్ ఓ కె. మోహన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ… ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ -2026 లో భాగంగా పోలింగ్ స్టేషన్ ల రేషనలైజేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1776 పోలింగ్ స్టేషన్ లు ఉండగా వీటిలో 11 పోలింగ్ స్టేషన్ లను పాత భవనాలు, కూలిపోయిన భవనాల నుండి కొత్త భవనాలకు మార్పు చేయగా మరో 68 పోలింగ్ స్టేషన్ ల పేర్ల మార్పు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1200 మందికి మించి ఉన్న పోలింగ్ స్టేషన్ ల పరిధిలో అదనంగా పోలింగ్ స్టేషన్ ల ఏర్పాటు చేయడం జరిగిందని, భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి అంశాల పై చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం 15,74,979 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. క్లెయిమ్ ల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, నియోజకవర్గ పరిధిలో ఎప్పటికప్పుడు క్లెయిమ్ ల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితా ప్రకారం త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అన్ని నియోజకవర్గాల్లో కలిపి ఫారం -6, క్రింద 65 వినతలు, ఫారం -7, క్రింద 21 వినతలు, ఫారం -8, క్రింద 76 వినతలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత బి ఎల్ వో లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, జిల్లాలో NGSP పోర్టుల్లో 69 వినతుల రాగా 68 వినతలు పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలోని బి ఎల్ వో బుక్ వే కింద 111 వినితలు రాగా 105 వినతులను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 6 వినతులకు సంబంధించి వారి వివరాలు లభించలేదని తెలిపారు.
ఈ సమావేశంలో చిత్తూరు ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, తెలుగుదేశం (TDP) పార్టీ ప్రతినిధి వి. సురేంద్ర కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి కల్లూరి బాలసుబ్రమణ్యం, బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధి సురేంద్ర బాబు, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వాడ గంగరాజు, వైసీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
