Subramanyeswara swamy | షష్టి వేడుకలు..
Subramanyeswara swamy | షష్టి వేడుకలు..
Subramanyeswara swamy, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలోని శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థాన ఉప ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సమేత అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామి వారికి శైవాగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షష్టి పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని దేవస్థానం ఈవో కందుల గోపాలరావు తెలిపారు.
విగ్నేశ్వర పూజతో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు ప్రారంభించామన్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అష్టోత్తర శత కలశములతో క్షీరాభిషేకాలు నిర్వహించినట్లు ఈవో గోపాలరావు తెలిపారు. షష్టి వేడుకల్లో దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ నేరుసు సుభాష్ చంద్రబోస్, ధర్మకర్తల కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
