CONGRESS | అభివృద్ధి బాటలో కొత్త అడుగులు

CONGRESS | అభివృద్ధి బాటలో కొత్త అడుగులు
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనలే మాకు ప్రేరణ.. కాంగ్రెస్‌లోకి చేరిన కార్యకర్తలు
CONGRESS | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం నియోకవర్గంలోని అభివృద్ధి బాటలో కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన శ్రేణులు భాగస్వామ్యం అవుతారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరి వంద మంది కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు. అంతర్గాం మండల కాంగ్రెస్ నాయకుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా నూతన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “ఇకపై మనమంతా ఒకే కుటుంబ సభ్యులం. ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి – ఇవే మా లక్ష్యాలు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా, నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను,” అని తెలిపారు. చేరికల్లో పాల్గొన్న నూతన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ, “రాజ్ ఠాకూర్ చూపిస్తున్న అభివృద్ధి దిశ, ప్రజల పట్ల చూపుతున్న నిజమైన శ్రద్ధే మాకు ప్రేరణ. ఆయన నాయకత్వంలోనే మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది,” అని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, పట్టణ కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు భారీగా పాల్గొని, కొత్త సభ్యులను అభినందించారు.
