High Court | స్థానిక ఎన్నికలపై విచారణ వాయిదా

High Court | స్థానిక ఎన్నికలపై విచారణ వాయిదా

High Court | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) లో స్థానిక సంస్థల ఎన్నికలపై (Local body elections) హైకోర్టులో విచారణవాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్‍పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది.

స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ సంఘం హైకోర్టుకు (High Court) తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీ (Cabinet meeting) లో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో ఇవాళ్టి విచారణ వాయిదా పడింది.

Leave a Reply