TEACHER | నగదు రహిత వైద్యం అందించాలి

TEACHER | నగదు రహిత వైద్యం అందించాలి

  • పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి
  • టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాస్టి. రమేష్

కురవి, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య విధానాన్ని అమలు చేయాలని, 2010 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారందరినీ టెట్ నుండి మినహించాలని, పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలని, పిఆర్సి అమలుపై మార్గదర్శకాలు విడుదల చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాస్టి. రమేష్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (Telangana Progressive Teachers Federation) కురవి మండల శాఖ అధ్యక్షులు గుండ్ల. విజయ్ కుమార్ అధ్యక్షతన స్కూల్ కాంప్లెక్స్ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వము ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉండడం వలన ఎన్నికలలో ఆ ప్రభుత్వాన్ని ఓడించి మరో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ఉద్యోగ,ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేసేలా విధానాలను అమలు చేస్తుందని వారు అన్నారు.

తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తో జరిపిన చర్చల సందర్భంగా నగదు రహిత వైద్య విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం సరైన విధానం కాదన్నారు. ఎన్సిటి ఈ నిబంధనల ప్రకారం గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకొని 2010 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తి లోకి వచ్చిన సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహ ఇంచాలని వారన్నారు. పెండింగ్ డిఏ బకాయిలను చెల్లించి, జులై, 2023 నుండి అమలు చేయాల్సిన పిఆర్సి అమలుపై మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ (Demand Govt) చేశారు. మార్చి, 2024 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని అన్నారు. గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకై ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరసనను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓదెల శివకుమార్ (Odela siva Kumar) బుక్క వీరేందర్ గుగులోత్ వెంకన్న చెన్నూరు శ్రీనివాస్ వీరేందర్ వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply