SCHOOL | స్పెషల్ క్యాంపెయిన్ 5.0

SCHOOL | స్పెషల్ క్యాంపెయిన్ 5.0
రాఘవాపూర్ పాఠశాల పరిశీలన
SCHOOL | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపూర్ ప్రాథమికోన్నత పాఠ శాలను ఈ రోజు పరిశీలించారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 (Special Campaign) కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర పరిశీలకురాలు, ఎస్‌సీఐటీ డైరెక్టర్ విజయలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలు విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీల్లో భాగంగా తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, పాఠశాల (School) ఆవరణ పరిశుభ్రత వంటి అంశాలను ఆమె కచ్చితంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, అకాడమిక్ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణపై కూడా సమగ్రంగా పరిశీలన చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమాన్ని పాఠశాలలో సక్రమంగా అమలు చేసిన తీరు పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఎంఓ నాగ రాజు (CMO Naga raju) మండల విద్యాశాఖ అధికారి జి. కొమురయ్య, ప్రధానోపాధ్యా యులు ఆర్.అనిల్, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
