Chess | ప్రతిభకు పట్టం..

Chess | ప్రతిభకు పట్టం..

Chadarangam, అశ్వారావుపేట రూరల్, (ఆంధ్రప్రభ) : వ్యవసాయ రంగంలో సేవలందిస్తూ, రైతులను పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ స్థిరమైన రాబడికి చర్చలు జరపుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుంది ఐ ఎఫ్ ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఆదివారం జంగారెడ్డిగూడెంలో రివిజినల్ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మ గాని బాలకృష్ణ ఆధ్వర్యంలో చదరంగం (Chadarangam) క్రీడాకారిణి భవ్య శ్రీలక్ష్మి, వారి తల్లిదండ్రులు కేశిబోయిన వీరాంజనేయులు, రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు.

ఈ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మగాని బాలకృష్ణ మాట్లాడుతూ.. చదరంగంలో (Chadarangam) రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ అశ్వారావుపేట ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన భవ్యశ్రీ లక్ష్మీ మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈనెల 20వ తారీఖున జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మా సంస్థ ప్రత్యేక అభినందనలతో పాటు పారితోషికంగా రూ.10,000 రూపాయలను ఆమెకు అందజేస్తున్నామని తెలిపారు. మా సంస్థ జూన్ 15, 2021లో స్థాపించబడిన నాటి నుండి వ్యవసాయ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని.. ప్రతి సంవత్సరం క్రీడల ప్రోత్సాహం, మెడికల్ క్యాంపులు, విద్యార్ధులకు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారుల్ని ప్రోత్సహించడం మా ఐ ఎఫ్ ఎల్ సంస్థ యొక్క ప్రత్యేకత అని తెలిపారు.

ఈ సంస్థ డైరెక్టర్ ఎస్.కె అబ్దుల్ రెహమాన్ బాబా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభలను ప్రోత్సహించడం మా బాధ్యత అని భవ్య శ్రీలక్ష్మి వంటి క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్నారు. మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీనరీని పెంపొందించటమే మా ప్రధాన లక్ష్యమని.. ఆ విధంగా రైతులను, ప్రజలను, విద్యార్థులను యువతీ యువకులను ప్రోత్సహించటం మా ప్రధాన విధి అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్, ఎస్.కె పాషా, అత్తిలి వీరబాబు, ఎస్.కె ఇక్బాల్, జొన్నలగడ్డ కాంతారావు, ఎస్.కె ఖలీల్ భాష, రవికుమార్, జీ వరలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.