Nalgonda | రన్ ఫర్ జస్టిస్…

Nalgonda | రన్ ఫర్ జస్టిస్…
Nalgonda | మునుగోడు, ఆంధ్రప్రభ : బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు(42 percent reservations) అమలు చేయాలని బీసీ జెఏసి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్(Run for Social Justice) నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి చౌటుప్పల్ రోడ్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, నల్గొండ రోడ్డులోని మార్కెట్ యార్డ్(Market Yard) వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్(Lingaiah Yadav), మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరటి మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఈర్ల లింగస్వామి యాదవ్, యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకులు ఈదులకంటి కైలాసం, మునుగోడు మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఆరేళ్ల సైదులు, పర్వతం గోవర్ధన్, తొరమామిడి యాదప్ప, నవీన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
