Telangana | నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం…

Telangana | నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం…
Telangana | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించటం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమా పథకాల పట్ల ఆకర్షితులైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగిందని, ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు నిర్వహించినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేయడం జరిగిందన్నారు.
ఈ ఎన్నికలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంప పెట్టులాంటిదని ఎమ్మెల్యే తోట అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
