Minister | పలు సమస్యలపై వినతి పత్రం…

Minister | పలు సమస్యలపై వినతి పత్రం…
Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34వ డివిజన్ శివనగర్ లో నెలకొని ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు డివిజన్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ఈరోజు మంత్రిని స్వగృహంలో కలిసి శివనగర్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం డివిజన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. శివనగర్ లో రోడ్డు కిరువైపులా కాలువలు నిర్మాణం చేపట్టాలని, భగీరథ త్రాగునీరు(Bhagiratha drinking water) సమస్యను పరిష్కరించాలని, డివిజన్లో తుప్పు పట్టిన 24 విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కొండ సురేఖకు అందజేశారు. స్పందించిన మంత్రి కొండా సురేఖ అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారని శ్రీనివాస వెల్లడించారు.
