బిహార్లో రికార్డు స్థాయి పోలింగ్…

- ఎన్డీఏ వైపే ఓటర్ల మొగ్గు
- ఎగ్జిట్ పోల్స్ వెల్లడి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, వివిధ ఏజెన్సీ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకొచ్చాయి.
అధిక శాతం సర్వేలు బిహార్లో మరోసారి ఎన్డీయేకే అధికారం దక్కే అవకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నాయి. మెజార్టీకి అవసరమైన 122 స్థానాలను దాటి కూటమి గెలిచే అవకాశం ఉందని అంచనా.

