ఐడీఓసీలో “వందేమాతరం” గీతాలాపన
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : “వందే మాతరం”జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఆ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. సామూహిక గీతాలాపనలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

