ఆదేశాలు పట్టించుకోని అధికారులు..

ఆదేశాలు పట్టించుకోని అధికారులు..
కమ్మర్ పల్లి, ( ఆంధ్ర ప్రభ ):-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వం కార్యాలయ అధికారులు పట్టించుకోలేదు. జాతీయ గీతం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో నవంబర్ 7, 2025 శుక్రవారం ఉదయం 10 గంటలకు వందేమాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో పాడాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కానీ.. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం, మండల విద్య వనరుల కేంద్రం, పశు వైద్య కేంద్రం తదితర కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది జాతీయ గీతన్ని ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కార్యాలయాలు కూడా తెరువలేదు. అధికారుల అలసత్వానికి మండల ప్రజలు మండిపడుతున్నారు. అయితే.. వందేమాతరం గీతాన్ని ఆలపించే ఈ కార్యక్రమం మండలంలోని తాహసిల్దార్ కార్యాలయం, ప్రజా పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
