రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత

రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశానికి సమీపాన ఉన్న పాకిస్తాన్, చైనా, ఆఫ్గానిస్తాన్ దేశాల్లో ఈ రోజులు తెలవారు జామున భూమి కంపించింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించిన ప్రకారం ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు భూమి కపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా ఉన్నట్లు గుర్తించింది.
భూమికి 240 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. మన దాయాది దేశమైన పాక్లో ఇటీవలే వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
