భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు
భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు
కిటకిటలాడిన ఆలయాలు
మంచిర్యాల జిల్లా చెన్నూర్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి (Kartik Purnima) పూజలు స్థానిక ఆగస్తేశ్వర (శివాలయం), జగన్నాథ ఆలయలలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉత్తరవాహిని గోదావరి తీరంలో స్నానం ఆచరించిన భక్తులు పెద్ద ఎత్తున శివాలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
