లింగాలలో ఉచిత కంటి వైద్య శిబిరం

అచ్చంపేట (ఆంధ్రప్రభ): కీ.శే. వడ్డె దేవమ్మ, కీ.శే. అండపల్లి నారాయణరెడ్డి (అక్క-తమ్ముడు) ఆశీర్వాదంతో అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి సోదరులు, చెన్నై శంకర నేత్రాలయ కంటి వైద్యశాల సంయుక్తంగా ఈనెల 10వ తేదీ నుండి లింగాల పట్టణ కేంద్రంలో నిర్వహించబోయే ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కోరారు. సోమవారం తన నివాసంలో ఈ శిబిరానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, అనూష ప్రాజెక్ట్స్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి, అండపల్లి కౌసల్యమ్మ, అండవల్లి రామకృష్ణారెడ్డి, అండపల్లి మధుసూదన్ రెడ్డిల సహకారంతో నవంబర్ 10 నుండి 16వ తేదీ వరకు లింగాల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిబిరం జరుగుతుందని తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పొర సమస్య కలిగిన వారికి శంకర నేత్రాలయ నిపుణ వైద్యులచే ఉచిత ఆపరేషన్లు కూడా చేస్తారు. ఈ ఆపరేషన్లు నవంబర్ 13 నుండి 17వ తేదీ వరకు జరగనున్నాయని చెప్పారు.

వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా లభించే ఈ శిబిరంలో నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని చికిత్స పొందాలని కోరారు. ఇతర వివరాల కోసం 88973 84164 | 70951 75251 | 80081 06566 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply