గ్రహణాలు విడిచాక సంప్రోక్షణ ఎందుకు చేస్తారు?

గ్రహణాలు విడిచాక సంప్రోక్షణ ఎందుకు చేస్తారు?
“ఛన్ద్రమా మనసో జాతశ్చక్షో: సూర్య అజాయత్!”
మనసుకు అధిపతి చంద్రుడు. నేత్రములకు అధిపతి సూర్యుడు. మానవ మేధస్సుకు అందని అనేక ఖగోళ రహస్యాలు నేటికీ వేధిస్తున్నాయి. ఈ అనంత విశ్వ ప్రహేళికను పూర్తిగా ఛేదించడం అసాధ్యం. ఇంత సంక్లిష్టమయి(Complicated)న ఖగోళ గణితమును మన భారతీయ ఋషులు లెక్కించి ఎన్నో విషయాలు ఖచ్చితత్వంతో మనకు అందించారు.
- అసలు సూర్యుని చుట్టూ నవగ్రహాలను ఎవరు తిరగనున్నారు?
- ఎందుకు తిరుగతున్నాయి?
- మన భూమి చూట్టూ చంద్రుడు ఎందుకు తిరుగుతున్నాడు?
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇదే దైవధర్మ పరిక్రమము. సృష్టికర్త యొక్క అజరామర క్రీడ. మానవ దేహములోని నీటి శాతము, భూగోళములో(on the globe)ని నీటి శాతము సమానము. మూడు వంతులు జలము, ఒక వంతు భూభాగము. సూర్యుని యొక్క అఖండ ఆకర్షణ, భూమి యొక్క ఆకర్షణ సమస్త వస్తు సముదాయాన్ని(community) పట్టి ఉంచుతోంది. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు చంద్రుని ఆకర్షణ వల్ల మానవ దేహములోని, భూగోళములోని జల భాగము ప్రభావితమై మానసిక భ్రమణములు, ఆటు-పోట్లు(ebb and flow) ఏర్పడుతున్నాయి. అదే విధముగా నక్షత్రముల కాంతి, మిగిలిన గ్రహముల ఆకర్షణ భూమిపై నివశించే ప్రతి జీవిపై ఖచ్చితంగా ఉంటుంది.
మానవుడు ఆ ప్రభావాన్ని గుర్తిస్తున్నాడు. ఈ విషయములపైనే జ్యోతిష శాస్ర్తము ఆవిర్భవించినది. చంద్రమానం ప్రకారం వేల సంవత్సరాల క్రితమే చంద్ర, సూర్య గ్రహణములను లెక్కట్టారు. సూర్యుని వలన గ్రహాలకు ఏర్పడే నీడలను ఛాయాగ్రహాలు(the eclipses)గా రాహు-కేతువులను ఏర్పరచారు. చంద్రునిపై పడే భూమి నీడను చంద్ర గ్రహణమన్నారు. మామూలు సమయంలో చంద్రుని కాంతి, ఆకర్షణ వల్ల మనపై ప్రభావము ఉన్నదని తెలుసుకున్నాం.
గ్రహణ సమయంలో పడే భూ ఛాయ వలన ఆ ప్రభావము యొక్క గుణాత్మకతలో మంచి, చెడుల భేదం ఉంటుంది కదా! అలాగే సూర్యునికి చంద్రుడు అడ్డంగా ఉన్నప్పుడు సూర్య గ్రహణ కాలం(the solar eclipse period)? ఆ సమయంలో ప్రత్యక్ష జీవ ప్రదాత యొక్క కిరణాలలో వక్రీభవనం వల్ల మంచి, చెడుల భేదం ఉంటుంది కదా! ఏదీ ఖచ్చితమైన సిద్ధాంతం కాదు. మనకు తెలుసున్నది గోరంత, తెలియ వలసినది కొండంత.
గడచిన యుగాలు మంత్ర, తంత్ర యుగాలు. ఇది యంత్రం యుగం. యంత్ర గమనమును మనం నమ్ముతున్నాం. అలాగే మంత్ర, తంత్ర గమనములు కూడా సత్యములే కదా! గడచిన కాలమంతా మూఢమని, మనం మనుగడ(survival) సాగిస్తున్నకాలమే హేతుబద్ధమని అనుకోవడమే అతిపెద్ద మూఢత్వం.
మంత్ర, తంత్ర యుగాల నుండే యంత్రం కనుగొనబడినది. అసలు ఒకటి సత్యము అని అంగీకరిస్తూ అన్వేషణ చేయడమే వివేకవంతుల లక్షణం. అంతే కానీ నాకే అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద అవివేకం. గ్రహణ సమయం(Eclipse Time)లో ఆహారం నిషేదమన్నారు. పాటిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు కదా! నాలుగు గంటలు
- భగవన్నామస్మరణ చేస్తే వచ్చే నష్టం ఏమిటి? కలిగితే ఎంతో కొంత లాభం తప్ప!
ఈ అనంత విశ్వంతో పోల్చితే మనం నివసించే భూగోళమే సూది మొనకు తక్కువ!ఇక దానిపై స్వల్ప కాలం నివసించే మనమెంత? మన మేధస్సు ఎంత?
కావున గ్రహణ సమయంలో సూర్య, చంద్రుల నుండి భూమిపై ప్రసరించే కిరణాలు, ఆకర్షణ శక్తి(gravitational force)లో చెడు ప్రభావం ఉండే అవకాశమే ఎక్కువ ఉంది.
ఎందువలననగా.. పూర్తి స్థాయిలో సకారాత్మక సకారాత్మక శక్తి ప్రసరణ జరుగదు.. అందువల్లనే జీవుల మెదడుపై, శరీరంపై దుష్ర్పభావం ఉంటుందనడంలో సందేహం లేదు. భూమిపై జీవుల పుట్టుకకు కారణం సూర్యభగవానుడైతే, ఔషధ వృక్షాలకు కారణం చంద్రడు.
ఇప్పటికే హిమాలయాల్లో పౌర్ణమికి వికసించే పుష్పాలు, ఔషధ మొక్కలు అనేకమున్నాయి. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికే మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం. దేవాలయంలో యంత్రాత్మక(Mechanical) మూర్తిని ప్రతిష్టించి అర్చన చేస్తాం. కోట్లాది మంది యొక్క హృదయాల వీక్షణాలు ఆ యంత్ర చరణాలపై ప్రవహించి శ్రీచరణాలు మరింత శక్తివంతమై మన మీద కటాక్షం కురిపిస్తాయి.
అందుకే గ్రహణ సమయంలో భూమి పైకి ప్రసారమయ్యే బలహీన ఆకర్షణ శక్తిని దేవాలయంలో నిక్షిప్తంగా ఉండే సకారాత్మక శక్తి తరంగాలకు నష్టం కలగకుండా దేవాలయాలను మూసివేస్తారు. తిరిగి తెరచినప్పుడు ముఖ్యంగా దర్భ జలాలతో సంప్రోక్షణ(Contact) చేసి మిగిలి ఉన్న అశుభ అంశములను కూడా ప్రారద్రోలతారు.
ఆగమ మంత్ర శక్తి తరంగాలకు ఆ శక్తి ఉంది. అలాగే గర్భిణీ స్ర్తీలను కూడా తగిన ప్రదేశాలలో ఉంచి రక్షణ కల్పిస్తారు. మాతృ గర్భం కూడా ఆలయంతో సమానం. ఇవన్నీసూక్ష్మమైన వేద రహస్యాలు. పాటించడం సాధ్యం కనుక అమలు చేసి మేలు పొందడం కూడా ఆ భగవదారాధనలో భాగమే!
- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
