Data Breach | గూగుల్‌కు రూ.2వేల‌ కోట్ల జరిమానా.. డేటా గోప్యతపై అమెరికా కోర్టు కీలక తీర్పు

డేటా గోప్యత ఉల్లంఘనపై ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ కోర్టు, ఆ రాష్ట్ర ఆండ్రాయిడ్ యూజర్ల తరపున దాఖలైన క్లాస్ యాక్షన్ దావాలో గూగుల్‌పై సుమారు రూ.2,650 కోట్లు (314.6 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.

వివాదం ఎమిటంటే

యూజర్ల అనుమతి లేకుండా… ఫోన్లు ఇన్-యాక్టివ్‌గా ఉన్నా స‌మ‌యంలో కూడా యూజ‌ర్ల‌ డేటాను సర్వర్లకు పంపించిందని, అది సెల్యులార్ డేటాను వినియోగించిందని గూగుల్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ డేటాను కంపెనీ టార్గెట్ చేసిన ప్రకటనలు, మ్యాప్ సేవల విస్తరణ కోసం ఉపయోగించిందని కేసులో పేర్కొన్నారు.

Leave a Reply