87. హిమానీహంతవ్యంహిమగిరినివాసైకచతురౌ
నిశాయాంనిద్రాణాంనిశిచరమభాగే చ విశదౌ
వ(ప)రం లక్ష్మీపాత్రంశ్రియమతిసృజంతౌసమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్.
తాత్పర్యం: జగజ్జననీ! నిత్యము మంచుకొండలయందు నివసించటంలో (సంచరించటంలో) నేర్పు గలిగి, రాత్రి పూట, రాత్రి చివరి సమయంలోనూ కూడ ప్రకాశ వికాసాలు కలిగి, సమయాచారపరులకుసిరిసంపదలనుమినుమిక్కిలి కలిగించగల నీ పాదాలు మంచు చేత నశింప చేయబడే, రాత్రివేళ ముడుచుకొనిపోయే, పగలు మాత్రమే లక్ష్మీదేవి అధిష్ఠించటానికి వీలున్న పద్మాలను జయించటంలో ఆశ్చర్య మేముంది? సహజమే అని భావం.
- డాక్టర్ అనంతలక్ష్మి