LIVE | ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఆంధ్రప్రభ : రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ పాట విడుదలకు ‘ఇరుముడి’ చిత్రబృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నేడు నిర్వహించనున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ పాటను విడుదల చేయనున్నారు. అభిమానుల అంచనాలు పెంచిన ఈ పాటపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ.. ఈసారి రవితేజతో భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. ‘ఇరుముడి’లో కుటుంబ భావోద్వేగాలకు భక్తి, యాక్షన్‌ అంశాలను జోడిస్తూ కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా.. జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తోంది. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది.

ఆగస్టు 21న థియేటర్లలోకి..

కాగా. ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ‘మల్లెపూల పల్లకి’ పాట విడుదలతో ప్రమోషన్స్‌కు మరింత ఊపు రానుంది. అయ్యప్ప భక్తి నేపథ్యంతో రూపొందిన ఈ పాటలో రవితేజ మాస్‌ ఎనర్జీ, జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం, శివ నిర్వాణ సినిమాటిక్‌ ట్రీట్‌మెంట్‌ కలవడంతో పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా విడుదలకు ముందే ‘మల్లెపూల పల్లకి’ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్‌