ది అఖిల భారతీయ విశ్వకర్మ మండల కమిటీ

  • జన్నారం మండల అధ్యక్షుడిగా కొత్తపెల్లి అశోక్ చారి

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కార్యవర్గాన్ని ఆదివారం సాయంత్రం ఎన్నుకున్నట్లు ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్ చారి తెలిపారు. మహాసభ కమిటీ అధ్యక్షునిగా కొత్తపెల్లి అశోక్ చారి (మందపల్లి), మండల ప్రధాన కార్యదర్శిగా దేశి రాజ్ వెంకటేష్ చారి, కోశాధికారిగా కసావోజుల సత్యంచారి లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు వారందరికీ నియామక పత్రాలను అందజేసినట్లు ఆయన చెప్పారు.ఈ సందర్భంగా ఆ మహాసభ మండల అధ్యక్షుడు అశోక్ చారి మాట్లాడుతూ.. మండలంలోని విశ్వకర్మ లను అందర్నీ ఐక్యం చేస్తూసంక్షేమానికి కృషి చేస్తానన్నారు.