అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి అన్నదాన విభాగానికి కృష్ణలంక ప్రాంతానికి చెందిన పి. రామయ్య, లావణ్య దంపతులు భక్తిపూర్వకంగా రూ.1,00,000 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం, పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళానికి సంబంధించిన రసీదును ఆలయ అధికారులు వారికి అందజేశారు.
