రామయ్యగూడ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు
- కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్ చొరవతో సమస్య పరిష్కారం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ రోడ్డులో శివరాం నగర్ సమీపంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. వీధి దీపాలు లేకపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను 31వ వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించి నూతన వీధి దీపాలను ఏర్పాటు చేశారు. వీధి దీపాలు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వీధి దీపాలు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం తదితర సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
