ఘనంగా డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క జన్మదిన వేడుకలు

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జన్మదిన వేడుకలను ఆదివారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సుగుణక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శంకరరావు, డీసీసీ కార్యవర్గ సభ్యుడు సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదివాసీ ముద్దుబిడ్డ సుగుణక్క ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, సహాయం చేసే మానవత్వం కలిగిన నాయకురాలని అన్నారు.

ఆమె నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గ సభ్యుడు సుద్దాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆత్రం దౌలత్రావు, సర్పంచుల ఫోరం సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు పేందూర్ గణపతరావు, ఏఎంసీ డైరెక్టర్ ఆత్రం లచ్చు, సర్పంచులు మడావి లక్ష్మణ్, జానే రావు, దేవదాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.