ఎమ్మెల్యే తోట వారి విందు.. కనువిందు
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుటుంబ వివాహ విందు సందడిగా కొనసాగుతోంది. బిచ్కుంద మండలంలోని డీబీఎల్ సైట్ ప్లాంట్ వద్ద ఎమ్మెల్యే కుమార్తె జోనిటా–దాస్ వివాహ విందు ఏర్పాటు చేశారు. విందుకు ఇప్పటికే వేలాది మంది తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కార్యక్రమం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
