చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలి
- జాతీయ నాయకుల వేషధారణలో బాలబాలికలు
- చిన్నారులను అభినందించిన సీఐ రఘు
నర్సాపురం, ఆంధ్రప్రభ : చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించి, జాతీయ భావాన్ని అలవర్చాలని పట్టణ సీఐ ఆకుల రఘు అన్నారు. స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల వేషధారణలో వచ్చిన బాలబాలికలను సీఐ రఘు అభినందించారు. వారికి బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను చిన్నారులు సాకారం చేయాలని సూచించారు. చిన్నతనం నుంచే దేశభక్తిని అలవర్చుకోవడంతో పాటు జాతీయ నాయకుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఔన్నత్యం, గణతంత్ర దినోత్సవ విశిష్టత వంటి విషయాలను పిల్లలకు తెలియజేయడం ద్వారా వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చని సీఐ రఘు పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐలు ప్రేమరాజ్, ముత్యాలరావు, పోలీసులు, జమీందార్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
