ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ గార్డ్ వద్ద పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమయంలో కమిషనరేట్ పరిపాలనా కార్యాలయం వద్ద అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకటరమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పతాకావిష్కరణ అనంతరం కమిషనర్, అదనపు డీసీపీలు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.