చెన్నూరులో జనసేన పార్టీ సమావేశం..
చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనివారం జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. జనసేన యువజన విభాగం రాష్ట్ర నాయకులు సిద్దు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఆగస్టు 30న నిర్వహించనున్న జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఉద్యమ సాధకుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, బాధ్యతలపై నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి, మంతెన సంపత్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
