కడెంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో శనివారం ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బి. అరుణ, పాండవపూర్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ రామడుగు శైలజ రమేష్‌రావు, కడెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సాయికిరణ్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ గీతారాణి, విజయ పాల కేంద్రంలో మేనేజర్ ఎస్. వెంకటస్వామి, నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ ప్రవీణ్‌కుమార్ జెండాలను ఆవిష్కరించారు.

నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ సీహెచ్. శకుంతల, కడెం పీహెచ్‌సీలో డాక్టర్ కే. శివకుమార్, ఎస్‌బీఐ బ్యాంకు వద్ద మేనేజర్ సంతోష్‌కుమార్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం గంగాధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గంగాధర్, కడెం పశువైద్యశాలలో డాక్టర్ సౌందర్య, కడెం కేజీబీవీ పాఠశాలలో ఎస్‌ఓ విమల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ జి. శ్రీనివాస్‌రెడ్డి, పెద్దూర్ టీజీబీ బ్యాంకు వద్ద ఫీల్డ్ ఆఫీసర్ అభినయ్, అల్లంపల్లి జీయర్ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కడెం, లింగాపూర్, అంబారిపేట్ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలు శ్రీనివాసరెడ్డి, బి. వెంకటరమణ, రమేష్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ దికొండ విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కడెం పట్టణ అధ్యక్షుడు ఎండీ. వాజిద్, బీజేపీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద స్థానిక గ్రామ సర్పంచులు మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు ప్రభాతభేరి నిర్వహించి, గ్రామాల్లో ఊరేగింపులు చేపట్టారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.