పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్

ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొలనూర్ గ్రామంలోని ఓ ఇంటి ముందు ఖాళీ స్థలంలో డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పొత్కపల్లి ఎస్ఐ సనత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 10 మందిని అక్కడికక్కడే పట్టుకున్నారు.

వారి నుంచి రూ.70,500 నగదు, 8 మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్ఐ సనత్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో పేకాట, బెట్టింగ్, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.