ఆటోనగర్‌లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ…
కేంద్ర పార్టీ నమూనాతో ఆధునిక కార్యాలయ నిర్మాణం
పార్టీ శ్రేణులకు శాశ్వత వేదికగా కొత్త కార్యాలయం
కార్యాలయ నిర్మాణానికి టీడీపీ కేంద్ర నాయకత్వం మార్గదర్శకత్వం
ఏడాది కాలంలో పనులు పూర్తి చేస్తాం
ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ
భూమిపూజలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు
భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
(విజయవాడ, ఆంధ్రప్రభ ) : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన కార్యాలయం రూపుదిద్దుకోనుంది. విజయవాడ ఆటోనగర్‌లో జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. పార్టీ శ్రేణులకు శాశ్వత వేదికగా, జిల్లా రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచేలా కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు గద్దె అనురాధ తెలిపారు. సుమారు ఏడాది కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేసి జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

కేంద్ర పార్టీ నమూనాతో నిర్మాణం..
జిల్లా టీడీపీ కార్యాలయాన్ని కేంద్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ కేంద్ర నాయకత్వం సూచనలు, సలహాలతో నిర్మించనున్నట్లు గద్దె అనురాధ తెలిపారు. కేంద్ర పార్టీ అందించిన నమూనా ప్రకారమే నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

భూమిపూజలో నేతల సందడి..
భూమిపూజ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నూబోయిన చిట్టిబాబుతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉండవల్లి శ్రీదేవి, కొమ్మారెడ్డి పట్టాభి, ఎం.కె. బేగ్, నాగుల్ మీరా, బాలకోటయ్య, గొట్టుముక్కల రఘురామ్, దూండి రాకేష్, ఎరుబోతు రమణ, ఫరూక్ సుబ్లీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
