సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాట.. చెన్నూరులో పాదయాత్ర

చెన్నూరు, ఆంధ్రప్రభ : సీపీఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి నేన్నెల సమ్మయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ప్రారంభమైంది.

పాదయాత్ర కొత్తగూడెం, అంబేద్కర్‌ చౌక్, గాంధీ చౌక్, కోటపల్లి బస్‌స్టాప్‌ మీదుగా సాగింది. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.